మాట మూరెడు బావం బండెడు

మాట మూరెడు బావం బండెడు అన్నట్లుగా మన తెలుగు మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు లేదా తెలుగు సూక్తులు లేదా తెలుగు సామెతలు లేదా తెలుగు జాతీయాలు… ఇంకా మంచి మాటలు, గొప్ప మాటలు ఏదైనా బావం బలంగా ఉంటే, మాటలు సాదారణంగా ఉంటాయి. మాట మంచిదయితే, ఊరు మంచిదవుతుందంటారు. నోరు మంచిదయితే ఊరంతా స్నేహితులే...

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లుగా కొందరి మాటలు ఉంటాయి.

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లు కొందరి ప్రవర్తన మరియు మాటలు ఉంటాయని అంటారు. ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో జరిగినప్పుడు అది అందమే అవుతుంది. వయసుదాటిన పనులు కొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లు అంటూ అలాంటి తెలుగు సామెతల మాటలు వాడుతూ ఉంటారు. ముసలివయస్సులో కూడా సరసాలు ఆడి...

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు అని చెప్పడానికి ఇలాంటి తెలుగు సామెత మాటలు ప్రస్తావిస్తూ ఉంటారు. కష్టం మీద కష్టం వచ్చిపడుతుంటే, వ్యక్తియొక్క బాధ వర్ణానీతతంగానే ఉంటుంది. వివిధ కారణాల వలన నోటిలో పిప్పొళ్లు కానీ పళ్ళు కదలికలు గాని ఉండవచ్చును. అయితే అలా ఊగే పన్ను తీపి భరింపనలవికానిదిగా అనిపిస్తుంది....

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు. అనాలోచితంగా జీవితాన్ని నాశనం చేసుకునే నిర్ణయాలు తీసుకుంటూ, తిరిగి బాధపడి ప్రాణాలమీదకు తెచ్చుకునేవారికి నాలుగు మేలు మాటలు చెప్పే సందర్భంలో ఇలాంటి సామెత మాటలు వాడుతూ ఉంటారు. వస్తువు పోతే తిరిగి సంపాదించుకోవచ్చును. ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చును. పరీక్ష ఫెయిల్ అయితే మరలా వ్రాసి పాస్ అవ్వవచ్చును....

వెతకుతున్న తీగ కాలికి తగిలినట్టు

ఒక్కోసారి వెతుకుతున్న వస్తువు ప్రక్కనే ఉన్నా దృష్టికిరాదు. వెతికి వెతికి విసుగొచ్చినప్పుడు అదే ఏకాలికో తగలగానే… సంతోషం అనిపిస్తుంది. అలాంటి సంతోషకరమైన స్థితి ఎదురైనప్పుడు ఇలాంటి తెలుగు సామెతలు వాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఎవరో వ్యక్తి ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు… కానీ వెళ్లలేకపోతాడు… అలాంటి సమయంలో అతనింటికి తాను వెళ్లాలనుకున్న వ్యక్తే రావడం చూసినప్పుడు...

రాగంలేని భోగం త్యాగం లేని మనస్సు వలె

రాగంలేని భోగం త్యాగం లేని మనస్సు వలె ఉంటుందని… తాత్వికపరమైన ఆలోచనలు కలిగించే విధంగా కొన్ని తెలుగు జాతీయాలు ఉంటాయి. భోగం కోసం ఆర్జన చేయడం సహజమే…. కానీ బంధుమిత్రులను దూరం చేసుకుని సంపాదించినా, దాని వలన వచ్చే భాగం మాత్రం మనసుకు ఆనందం అందించదని అంటారు. మనసులో త్యాగ గుణం దూరం అయితే బంధు మిత్రులు...

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు తెలుగు జాతీయం ఉపయోగిస్తూ ఉంటారు. శక్తివంతుడు అయినవారికి ఎవరైనా వ్యక్తిపై కోపం పుట్టి అది వేదింపులవరకు వెళితే, అలాంటి సందర్భాలలో ఇలాంటి తెలుగు జాతీయాలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే పగ బట్టిన తాచుకు కాటు వేసే వరకు శాంతి ఉండదు. అలానే బలవంతులు మరియు అధికారం ఉన్నవారు పగ...

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు… కొందరు తమకు అప్పగించిన పనిని తగు సమయానికి ముగించకుండానే ఆ పని పూర్తి అయినట్టుగా చెబుతుంటారు. వాస్తవానికి ఆ పని పూర్తి అయ్యి ఉండదు. ఆరా తీస్తే కానీ వారు పనిని పూర్తి చేసినది? లేనిది? తెలియదు. కానీ నిలదీసి అడిగితే మాత్రం ఏవో కారణాలను చూపుతూ ఉంటారు....

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు అన్నట్టుగా కొందరు చెప్పినదంతా విన్నాక, తీరిగ్గా చెప్పినవారిని ఆశ్చర్యపరుస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా ఒక పనిని మరొకరికి అప్పగిస్తున్నప్పుడు కానీ… ఒకరు మరొక వ్యక్తికి ఏదైనా విషయం గురించి వివరిస్తున్నప్పుడు కానీ…. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఏదైనా చిరునామా చెబుతున్నపుడు కానీ… విన్నట్టే ఉంటారు… అంతా...

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

ఆర్ధికపరమైన విషయాలలో అవసరాల గురించి మాట్లాడే సందర్భంలో ఈ “వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు” మాటను వాడుతూ ఉంటారు. కుటుంబ పెద్దకు తోడుగా ఎవరైనా సంపాదిస్తున్నప్పుడు వారు తన యజమానికి తోడుగా ఎలా ఉన్నది చెబుతూ ఇలాంటి మాట ప్రయోగించవచ్చు. ఎవరైనా అయినవారు ఇంటికొస్తే, వారితో ఆర్ధికపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు… తను చేస్తున్న పనిని కూడా...